logo

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

ఇసుక అక్రమ రవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ హెచ్చరించారు.

Published : 21 May 2024 03:11 IST

పెద్దపప్పూరు: ఇసుక రీచ్‌లపై ఆరా తీస్తున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ 
పెద్దపప్పూరు, న్యూస్‌టుడే: ఇసుక అక్రమ రవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ హెచ్చరించారు. పెద్దపప్పూరులో గతంలో నిర్వహించిన ఇసుక రేవులను సోమవారం ఆయన పరిశీలించారు. తవ్వకాలపై భూగర్భ గనుల శాఖ అధికారులతో వివరాలు ఆడిగి తెలుకున్నారు. రేవుల వద్ద సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏర్పాటు చేసేaలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీపంలో చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేయాలన్నారు. 

బుక్కరాయసముద్రం: జిల్లాలో ఎక్కడ ఇసుక అక్రమాలు జరుగుతున్నా ప్రజలు నేరుగా కలెక్టర్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌ కోరారు. సోమవారం కొర్రపాడు గ్రామం వద్ద ఉన్న ఇసుక స్టాక్‌ పాయింట్‌ను తనిఖీ చేశారు. ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయడానికి త్వరలోనే టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట మైన్స్‌ డీడీ నాగయ్య, తిప్పేస్వామి, ఈఈ కిశోర్‌రెడ్డి, ఏజీ ఆదినారాయణ, ఇతర అధికారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని