logo

ఏసీఎల్‌ తుదిపోరుకు ఇండియన్‌ సిక్సర్స్‌ జట్టు

అనంత క్రికెట్‌ లీగ్‌ ఫైనల్‌కు ఇండియన్‌ సిక్సర్స్‌ జట్టు అర్హత సాధించింది. అనంత క్రీడాగ్రామంలో సోమవారం జరిగిన పోటీలో ఇండియన్‌ జట్టు ఫ్యామిలీ క్లబ్‌ జట్టును 89 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

Published : 21 May 2024 03:31 IST

వీరారెడ్డికి అవార్డు అందజేస్తున్న రంజీ మాజీ క్రీడాకారుడు కృష్ణకుమార్‌

అనంతపురం క్రీడలు: అనంత క్రికెట్‌ లీగ్‌ ఫైనల్‌కు ఇండియన్‌ సిక్సర్స్‌ జట్టు అర్హత సాధించింది. అనంత క్రీడాగ్రామంలో సోమవారం జరిగిన పోటీలో ఇండియన్‌ జట్టు ఫ్యామిలీ క్లబ్‌ జట్టును 89 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇండియన్‌ జట్టు కేహెచ్‌ వీరారెడ్డి (67), ఎం.హరిశంకర్‌రెడ్డి (43)లు బ్యాటింగ్‌లో కదం తొక్కడంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులు చేసింది. అనంతరం భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన ఫ్యామిలీ క్లబ్‌ జట్టు 19.1 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఇండియన్‌ సిక్సర్స్‌ జట్టు ఫైనల్లో ప్రవేశించింది. మంగళవారం జరగనున్న ఫైనల్‌ పోటీలో ఈ జట్టు అనంత రైజింగ్‌ స్టార్‌ జట్టుతో తలపడుతుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును వీరారెడ్డికి రంజీ మాజీ క్రీడాకారుడు కృష్ణకుమార్‌ అందజేశారు. ఫైనల్‌ పోటీ మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి మధుసూదన్‌ తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని