logo

శాంతిభద్రతలు పర్యవేక్షించండి

జూన్‌ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపులో ఆయా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అరుణ్‌బాబు పేర్కొన్నారు.

Published : 21 May 2024 03:44 IST

ఓట్ల లెక్కింపులో ఆర్వోలదే కీలకపాత్ర : కలెక్టర్‌

సమావేశంలో మట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు 
పుట్టపర్తి, న్యూస్‌టుడే : జూన్‌ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపులో ఆయా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అరుణ్‌బాబు పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జూన్‌ 4న ఓట్ల లెక్కింపు నిర్వహణపై నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్, డీఆర్‌ఓ కొండయ్య, పెనుగొండ సబ్‌ కలెక్టర్, పెనుగొండ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అపూర్వ భరత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు లా అండ్‌ ఆర్డర్‌ మానిటరింగ్‌ చేయాలని ఆదేశించారు. లెక్కింపు సమయంలో రిటర్నింగ్‌ అధికారి ఏ నిర్ణయం తీసుకుంటారు.. అదే తుది నిర్ణయంగా పరిగణించాలన్నారు. ఈ నెల 24న కలెక్టరేట్‌లో కౌంటింగ్‌ ప్రక్రియపై కార్యశాల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు హాజరు కావాలన్నారు. లెక్కింపు పక్కాగా జరపాలన్నారు. ఫలితాలు ప్రకటించిన అనంతరం సంబంధిత ఈవీఎంలు, వీవీప్యాట్‌లు స్ట్రాంగ్‌ రూంలో భద్రపరచాలన్నారు. కౌంటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ఆర్డీఓలు భాగ్యరేఖ, వెంకటశివసాయిరెడ్డి, వంశీకృష్ణ మడకశిర నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి గౌరీ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని