logo

ఎన్‌ఐఏ సోదాలతో దుర్గం ఉలికిపాటు

రాయదుర్గంలో ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అధికారుల సోదాలతో మంగళవారం ఉదయం పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. పట్టణంలోని నాగులకట్టవీధిలో విశ్రాంత ఉపాధ్యాయుడు అబ్దుల్లా ఇంట్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే సోదాలు జరుపుతున్న విషయం దావనంలా పట్టణమంతా వ్యాపించింది.

Updated : 22 May 2024 08:27 IST

రాయదుర్గంలో సోహైల్‌ ఇల్లు

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాయదుర్గంలో ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అధికారుల సోదాలతో మంగళవారం ఉదయం పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. పట్టణంలోని నాగులకట్టవీధిలో విశ్రాంత ఉపాధ్యాయుడు అబ్దుల్లా ఇంట్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే సోదాలు జరుపుతున్న విషయం దావనంలా పట్టణమంతా వ్యాపించింది. సోహైల్‌ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేసి.. బెంగళూరుకు తరలించడం చర్చనీయాంశమైంది. స్థానిక పోలీసుల సహకారంతో తెల్లవారుజామున 4 గంటల సమయంలో వాహనాల్లో వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు సోహైల్‌ ఇంటిని చుట్టు ముట్టడంతో స్థానికులు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. 

ఎవరితో మాట్లాడే వాడు కాదు.. 

ఇంట్లో నుంచి సోహైల్‌ బయటికి వచ్చేవాడు కాదని.. ఎవరితోనూ పెద్దగా మాట్లాడే వాడు కాదని స్థానికులు చెబుతున్నారు. ఇంటర్మీడియట్‌ వరకు రాయదుర్గంలో చదివిన అతను కుప్పంలో బీటెక్‌  పూర్తిచేశాడు. ఆ సమయంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కోలుకున్నాక బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు