logo

సీఎం జగన్‌పై టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఫిర్యాదులు

అబద్ధపు హామీలతో విద్యార్థులకు సీఎం జగన్‌ నమ్మకద్రోహం చేశారని..సీఎంపై కేసు నమోదు చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు లక్ష్మీనరసింహ, జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయుడు గురువారం అనంతపురం గ్రామీణం పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేశారు.

Updated : 08 Dec 2023 04:35 IST

అనంతపురం గ్రామీణం సీఐ రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేస్తూ..

అనంత నేరవార్తలు, హిందూపురంఅర్బన్‌: అబద్ధపు హామీలతో విద్యార్థులకు సీఎం జగన్‌ నమ్మకద్రోహం చేశారని..సీఎంపై కేసు నమోదు చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు లక్ష్మీనరసింహ, జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయుడు గురువారం అనంతపురం గ్రామీణం పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ. ‘అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఎంత ఖర్చు అయినా భరిస్తానని..మీ పిల్లలు డాక్టర్‌, ఇంజినీర్‌ ఇలా ఏది కావాలన్నా చదువుకోమనండి..చదివించే పూచీ నాది’ అని ప్రగల్బాలు పలికిన జగన్‌..అధికారం చేపట్టాక మాట తప్పాడని ఆరోపించారు. నాణ్యమైన విద్య లభించక విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు టీచర్ల కొరత, మరోవైపు పనికిరాని బైజూస్‌లో అవినీతితో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ అథమ స్థాయికి దిగజారిందన్నారు.నాలుగున్నరేళ్లలో 7.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి తరలిపోయారన్నారు. అమ్మఒడి, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ తదితర స్కీంలు అటకెక్కాయని తెలిపారు. నాడు నేడు పేరుతో పాఠశాలలకు రంగులు వేసి రూ.3 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అబద్ధపు మాటలు, హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేయాలని సీఐ రామకృష్ణారెడ్డిని కోరారు.

హిందూపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లోనూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఎంపీ నియోజకవర్గ అధ్యక్షుడు కురుబ జగదీశ్‌ ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. సంఘం ఉపాధ్యక్షుడు వెంకటాపురం అభి, అధికార ప్రతినిధి ఎండీఎస్‌ అమన్‌, కార్యదర్శి మూర్తి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని