logo

ఎట్టకేలకు గ్యాస్‌ సిలిండర్ల సరఫరా

గత వారం రోజులుగా ఇండేన్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా స్తంభించిపోయింది. గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు, రవాణాదారుల మధ్య నెలకొన్న వివాదం కారణంగా రవాణా ఆగిపోవడంతో వినియోగదారులు అవస్థలు పడ్డారు.

Published : 08 Dec 2023 04:27 IST

ఉరవకొండ గ్యాస్‌ ఏజెన్సీ గోదాము వద్ద సిలిండర్లను దించుతున్న హమాలీలు

ఉరవకొండ, అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: గత వారం రోజులుగా ఇండేన్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా స్తంభించిపోయింది. గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు, రవాణాదారుల మధ్య నెలకొన్న వివాదం కారణంగా రవాణా ఆగిపోవడంతో వినియోగదారులు అవస్థలు పడ్డారు. సమస్యపై ఈనెల 6న ‘ఈనాడు’లో ‘స్తంభించిన గ్యాస్‌ సిలిండర్ల సరఫరా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అనంతపురం జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ స్పందించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ ఐవోసీˆఎల్‌ అధికారులకు లేఖ రాశారు. నేరుగా కంపెనీ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సిలిండర్లు పంపిణీ ఆపేసి వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తే ఎలా అని జేసీ అసహనం వ్యక్తం చేశారు. కడపలోని ఎల్‌పీజీ ప్లాంటు నుంచి గ్యాస్‌ సిలిండర్లు రవాణా అవుతున్నాయి. అక్కడి నుంచి అన్ని ఏజెన్సీలకు సరఫరా చేస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిణి శోభారాణి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని