logo

జగన్‌.. నాడు - నేడు దుస్థితి చూడు

నాడు - నేడు కింద పాఠశాలల్లో అత్యాధునిక వసతులను కల్పించామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పదే పదే డప్పు కొడుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

Published : 03 Apr 2024 07:25 IST

మండుటెండలో విద్యార్థులకు భోజనం

ఎండలోనే భోజనం వడ్డిస్తూ..

ఉరవకొండ, న్యూస్‌టుడే : నాడు - నేడు కింద పాఠశాలల్లో అత్యాధునిక వసతులను కల్పించామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పదే పదే డప్పు కొడుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇందుకు నిదర్శనం ఈ చిత్రాలు. ఉరవకొండ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు సరైన సదుపాయాలు లేక మధ్యాహ్న భోజనం ఎండలో తినాల్సి వస్తోంది.

విద్యార్థులకు నిత్యం ఇదే పరిస్థితి..

మంగళవారం మండే ఎండలో విద్యార్థులు భోజనం వడ్డించారు. ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 363 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొదటి దశ నాడు - నేడు పనుల్లో భాగంగా రూ.24 లక్షలు కేటాయించారు. ఈ మేరకు భోజన షెడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. నిధుల కొరతతో పనులు ఆపేశారు. దీంతో విద్యార్థులు ఆరుబయట, ఇరుకుగా ఉన్న వంట గది సమీపాన కూర్చుని తింటున్నారు.ఈ విషయాన్ని ప్రిన్సిపల్‌ ప్రశస్తికుమారి దృష్టికి తీసుకు పోగా నిధులు చాలక పోవడంతో  నిర్మాణం ఆగి పోయిందని, నీడలో కూర్చుని భోజనం చేయమని విద్యార్థులకు సూచించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని