logo

శ్రీవారిని దర్శించుకున్న ‘బంగారు బాబు’.. 10 కిలోల ఆభరణాలతో..

శ్రీవారి భక్తుడు, హైదరాబాద్‌కు చెందిన కొండా విజయ్‌కుమార్‌ గురువారం తిరుమలలో సందడి చేశారు.

Updated : 15 Mar 2024 08:18 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి భక్తుడు, హైదరాబాద్‌కు చెందిన కొండా విజయ్‌కుమార్‌ గురువారం తిరుమలలో సందడి చేశారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో దాదాపు పది కిలోల బరువైన ఆభరణాలు ధరించి స్వామివారిని దర్శించుకున్న ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పెద్దఎత్తున గుమిగూడారు. మెడలో చాంతాడంత చైన్లు, చేతికి కడియాలు, ఉంగరాలు, బంగారు వాచ్‌తో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోప్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, భక్తులను దర్శనాలకు తీసుకురావడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు సొంత నిధులతో చేపడుతున్నట్లు చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు