logo

కొండను కొట్టి.. అమ్మకానికి పెట్టి!

ఎన్నికల తర్వాత ఎలాగూ తమ ప్రభుత్వం రాదని గ్రహించిన వైకాపా నేతలు అయిన కాడికి దండుకునేందుకు బరితెగిస్తున్నారు. రామచంద్రాపురం మండలం సి.రామాపురం పరిధిలో జగనన్న కాలనీని ఆనుకుని ఉన్న కొండను కొట్టి ప్లాట్లు చేసి విక్రయాలు ప్రారంభించారు.

Published : 13 Apr 2024 01:57 IST

సి.రామాపురంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి అనుచరుల దంద్ఞా

సి.రామాపురంలో ధ్వంసమైన కొండ

ఈనాడు-తిరుపతి: ఎన్నికల తర్వాత ఎలాగూ తమ ప్రభుత్వం రాదని గ్రహించిన వైకాపా నేతలు అయిన కాడికి దండుకునేందుకు బరితెగిస్తున్నారు. రామచంద్రాపురం మండలం సి.రామాపురం పరిధిలో జగనన్న కాలనీని ఆనుకుని ఉన్న కొండను కొట్టి ప్లాట్లు చేసి విక్రయాలు ప్రారంభించారు. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముఖ్య అనుచరులు నెరపుతుండటంతో అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులు సాహసించడం లేదు.

అవిలాల - రామచంద్రాపురం మార్గానికి సమీపంలోని సి.రామాపురం వద్ద కొండను కొంతమేరకు చదును చేసి గతంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. ఇప్పుడు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. మిగిలిన కొండపై కన్నేసిన వైకాపా నేతలు జేసీబీలతో చదును చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు తవ్వి ప్లాట్లుగా మార్చారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అండతోనే అనుచరులు కొండను తొలుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  

ఎన్నికల్లో పంచేందుకు కూడబెడుతూ..

కొండను తొలచి స్థలాలు విక్రయించగా.. వచ్చే సొమ్ములో కొంత ఎన్నికల్లో పంచి పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గ్రావెల్‌ను సైతం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికీ అక్కడ జేసీబీతో పనులు చేస్తున్నారు.

అధికారుల కళ్లకు గంతలు..

రహదారి పక్కనే ఈ కబ్జాకాండ సాగుతున్నా రెవెన్యూ అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు