logo

రెండింటా.. ఏడో స్థానం

ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో తిరుపతి విద్యార్థులు తమ స్థానం కొనసాగించారు. ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో నిలిచారు.

Published : 13 Apr 2024 01:58 IST

మొదటి ఏడాది 70%..
రెండో ఏడాది 81% ఉత్తీర్ణత

 తిరుపతి(భైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో తిరుపతి విద్యార్థులు తమ స్థానం కొనసాగించారు. ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో నిలిచారు. జిల్లాల పునర్విభజన తరువాత మొదటిసారిగా వేర్వేరుగా జరిగిన ఈ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోనూ రాష్ట్రస్థాయిలో తిరుపతి ఏడోస్థానం సాధించింది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 29,915 మందికిగాను 20,919 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 25,990 మందికిగాను 21,062 మంది పాల్గొన్నారు. వృత్తివిద్య కోర్సుల్లో మొదటి సంవత్సరంలో మొత్తం 1086 మందికిగాను 595 మంది (55%) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 500 మందికిగాను 345 మంది (69%).. బాలురు 586 మందికిగాను 250 మంది (43%) ఉత్తీర్ణత పొందారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 486 మందికిగాను 404 మంది (83%) ఉత్తీర్ణత పొందారు. బాలురు 477 మంది హాజరుకాగా 245 మంది (52%) ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 963 మందికిగాను 652 మంది (68%) ఉత్తీర్ణత పొందారు.

 వృత్తివిద్య కోర్సుల్లో చంద్రగిరి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల 67.72, 88.33 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఆర్‌ఐవో వెల్లడించారు.

వందశాతం ఉత్తీర్ణత

సత్యవేడు, న్యూస్‌టుడే: ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, అంబేడ్కర్‌ బాలికల గురుకుల కళాశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. సత్యవేడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 88మంది పరీక్షలకు హాజరు కాగా 88 మంది, మొదటి సంవత్సరం విద్యార్థులు 73 మందికి 73మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్‌ జగన్‌మోహన్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని