logo

గోల్డెన్‌ అవర్‌లో ఫిర్యాదు చేయండి: ఎస్పీ

చరవాణులు పోగొట్టుకున్నా, సైబర్‌ నేరాలకు గురైనా గోల్డెన్‌ అవర్‌లో ఫిర్యాదు చేసి న్యాయం పొందాలని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు.

Published : 13 Apr 2024 02:12 IST

రూ.65 లక్షల విలువైన చరవాణుల అప్పగింత

మాట్లాడుతున్న ఎస్పీ మణికంఠ చందోలు

 చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: చరవాణులు పోగొట్టుకున్నా, సైబర్‌ నేరాలకు గురైనా గోల్డెన్‌ అవర్‌లో ఫిర్యాదు చేసి న్యాయం పొందాలని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. చిత్తూరు పోలీసు అతిథిగృహంలో శుక్రవారం చరవాణులను బాధితులకు అప్పగించి మీడియాతో మాట్లాడారు. సైబర్‌ నేరగాళ్లు నగదు కాజేసిన తర్వాత గంట పాటు గోల్డెన్‌ అవర్‌గా పరిగణిస్తామని, ఆ సమయంలోగా ఫిర్యాదు చేస్తే నగదు ఫ్రీజ్‌ చేసే వీలుందన్నారు. రూ.లక్ష పోతే అందులో రూ.75 వేలు తిరిగి ఇప్పించొచ్చన్నారు. ప్రజలు జారవిడుచుకున్న, చోరీకి గురైన  300 చరవాణులను జిల్లాలో ఛాట్‌బాట్‌, సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా ఐదో విడతల్లో రికవరీ చేసి బాధితులకు అందించామని చెప్పారు. ఇప్పటి వరకు 1,500 చరవాణులు బాధితులకు అందజేసి వారి కళ్లలో ఆనందం నింపామంటూ.. ఛాట్‌బాట్‌ బృందాన్ని అభినందించారు. ఛాట్‌బాట్‌, సీఈఐఆర్‌ పోర్టల్‌, సైబర్‌ క్రైమ్‌ విభాగాలు ఇకపైనా కొనసాగుతాయని ఎస్పీ ప్రకటించారు. ఏఎస్పీ ఆరిఫుల్లా, క్రైం సీఐ రామాంజనేయులు పాల్గొన్నారు.

 

పోలీసులు స్వాధీనం చేసుకున్న చరవాణులు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని