logo

దత్తత గ్రామం అభివృద్ధి ఏదీ..?

మా గ్రామాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మూడేళ్ల క్రితం హామీ ఇచ్చారు. ఆ సమయంలో జిల్లా, మండల స్థాయి అధికారులను సైతం గ్రామానికి తీసుకువచ్చి అభివృద్ధికి మాట ఇచ్చారు.

Published : 13 Apr 2024 02:17 IST

వైకాపా నాయకులను ప్రశ్నించిన ప్రజలు

పెనుమూరు, న్యూస్‌టుడే: మా గ్రామాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మూడేళ్ల క్రితం హామీ ఇచ్చారు. ఆ సమయంలో జిల్లా, మండల స్థాయి అధికారులను సైతం గ్రామానికి తీసుకువచ్చి అభివృద్ధికి మాట ఇచ్చారు. ఆ తరవాత ఇప్పటివరకు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో ఇప్పుడు వచ్చారని చిప్పారపల్లె పంచాయతీ పాళ్యం యానాదికాలనీ ప్రజలు వైకాపా నాయకులను ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి దయాసాగర్‌రెడ్డి, ఎంపీపీ హేమలత, జడ్పీటీసీ దొరస్వామి తదితరులు శుక్రవారం పాళ్యంయానాది కాలనీకి ప్రచార నిమిత్తం వెళ్లారు. ఆ సమయంలో గ్రామ ప్రజలు ఆనాటి హామీలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. రహదారి సౌకర్యం లేదని, పక్కా ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయిన ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి అంతవరకు ప్రచారంలో పాల్గొని ఇక పాళ్యం యానాది కాలనీకి వెళ్లే సమయంలో తిరుపతిలో పని ఉందని వెళ్లిపోయినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని