logo

తిరుపతిలో ఎగిరేది కూటమి జెండానే

తిరుపతిలో తప్పక గెలుస్తామనే ఉద్దేశంతోనే తాను, చంద్రబాబు కలిసి జనసేన అభ్యర్థిని నిలబెట్టామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు.

Published : 13 Apr 2024 02:27 IST

ఐక్యంగా పనిచేయాలని నేతలకు జనసేనాని పవన్‌కల్యాణ్‌ పిలుపు 

నాయకులతో సమీక్షిస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, తిరుపతి (నగరం): తిరుపతిలో తప్పక గెలుస్తామనే ఉద్దేశంతోనే తాను, చంద్రబాబు కలిసి జనసేన అభ్యర్థిని నిలబెట్టామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు. కూటమి నేతలందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును గెలిపించాలని కోరారు. శుక్రవారం సాయంత్రం ఆయన తిరుపతికి వచ్చి కూటమి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెదేపా, భాజపా, జనసేన నేతలతో వేర్వేరుగా మాట్లాడారు. తొలుత తెదేపా నేతలతో ఆయన సమావేశమయ్యారు. కూటమి పొత్తుకు దారి తీసిన పరిస్థితులను నేతలకు వివరించారు. తిరుపతిలో జరుగుతున్న అక్రమాలు ప్రతి ఒక్కరికీ తెలుసని, తిరుమల కొండకు వెళ్లే పరిస్థితి లేదని, వైకాపా అభ్యర్థి భూమన అభినయ్‌రెడ్డి గెలిస్తే తిరుపతిలో ఉండలేని పరిస్థితి తలెత్తుతుందన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు.  అనంతరం జనసేన నేతలతో ఆయన భేటీ అయ్యారు. సమావేశంలో తెదేపా నేతలు నరసింహయాదవ్‌, ఊకా విజయ్‌కుమార్‌, జేబీ శ్రీనివాస్‌, పెద్దప్ప, జనసేన నేతలు పసుపులేటి హరిప్రసాద్‌, కిరణ్‌రాయల్‌, రాజారెడ్డి, కీర్తన, సుభాషిణి, హేమకుమార్‌, కిషోర్‌, మనోజ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని