logo

ప్రథమం అథమం.. ద్వితీయం దిగదిడుపు

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఇంటర్‌ ఫలితాల సాధనలో చిత్తూరు జిల్లా చతికిలబడింది. రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా.. చిత్తూరు జిల్లా ఫలితాల్లో చివరి రెండు స్థానాలకు పరిమితమైంది.

Published : 13 Apr 2024 02:30 IST

 ఇంటర్‌ ఫలితాల్లో చివరి రెండు స్థానాలకు పరిమితం
జిల్లాలో బాలికలదే పైచేయి..

ఇంటర్‌ ఫలితాల్ని విడుదల చేస్తున్న డీవీఈవో సయ్యద్‌మౌలా

 చిత్తూరు కలెక్టరేట్‌, విద్య, న్యూస్‌టుడే: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఇంటర్‌ ఫలితాల సాధనలో చిత్తూరు జిల్లా చతికిలబడింది. రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా.. చిత్తూరు జిల్లా ఫలితాల్లో చివరి రెండు స్థానాలకు పరిమితమైంది. ఇంటర్‌ ద్వితీయ ఫలితాల్లో జిల్లా 63 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే చివరి స్థానానికి (26వ స్థానం) దిగజారింది.. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 50 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 25వ స్థానంలో నిలిచింది. చిత్తూరు జిల్లా ఫలితాల్ని డీవీఈవో సయ్యద్‌ మౌలా శుక్రవారం విడుదల చేశారు.. ఫలితాల్లో బాలికలిదే పైచేయిగా నిలిచింది.

ప్రభుత్వ కళాశాలల్లో ఇలా..

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉత్తీర్ణత 50 శాతం దాటకపోవడం గమనార్హం. ప్రథమ ఇంటర్‌ ఫలితాల్లో 2,581 మంది హాజరవగా 806 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,372 హాజరుకాగా 272 ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 1,234 హాజరుకాగా 534 మంది ఉత్తీర్ణలయ్యారు. ద్వితీయ ఇంటర్‌లో 2,240 మందికిగానూ 1,083 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,118 మందికిగానూ 456 మంది, బాలికలు 1,122 మందికిగానూ 627 మంది ఉత్తీర్ణత సాధించారు.

  •  ఒకేషనల్‌ ఇంటర్‌ ఫలితాలు కాస్త పర్వాలేదనిపించాయి. ప్రథమంలో 1,360 మంది హాజరుకాగా 647 మంది ఉత్తీర్ణుల య్యారు. ఉత్తీర్ణత శాతం 48. బాలురు 868 మందికిగానూ  328 మంది, బాలికలు 492 మందికిగానూ 319 ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌ ద్వితీయంలో 1,144 మందికిగానూ 682 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 691 మందికిగానూ 335 మంది, బాలికలు 453 మందికిగానూ 347 మంది ఉత్తీర్ణులయ్యారు.
  •  ఒకేషనల్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 1,839 మందికి 941 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 1,055 మందికిగానూ 426 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 784 మందికి.. 515 మంది ఉత్తీర్ణులయ్యారు.
  •  ఒకేషనల్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 1,610 మంది హాజరవగా 1,008 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 910 మందికి.. 463 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 700 మందికి.. 545 మంది ఉత్తీర్ణులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని