logo

ద్రవిడలో జీతాలకు కొట్లాట..!

ద్రవిడ విశ్వవిద్యాలయ పొరుగు సేవల ఉద్యోగుల వ్యవహారం పరస్పర దాడుల వరకు వెళ్లింది. పెండింగ్‌ జీతాల కోసం ఓ వర్గం నిరసన తెలియజేస్తుండగా... మరోవర్గం వర్సిటీ అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

Published : 17 Apr 2024 03:00 IST

గుడుపల్లె పోలీసులకు ఇరువర్గాల ఫిర్యాదు

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: ద్రవిడ విశ్వవిద్యాలయ పొరుగు సేవల ఉద్యోగుల వ్యవహారం పరస్పర దాడుల వరకు వెళ్లింది. పెండింగ్‌ జీతాల కోసం ఓ వర్గం నిరసన తెలియజేస్తుండగా... మరోవర్గం వర్సిటీ అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సుమారు 200 మంది పొరుగు సేవల ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. మరోవర్గంలోని కొందరు యథావిధిగా విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో నిరసన చేస్తున్న వారు విధులకు హాజరైన వారితో వాగ్వాదానికి దిగారు. ఎనిమిది నెలలుగా అందని జీతాలకు పోరాడుతుంటే... మీరెలా విధులకు హాజరవుతారని ప్రశ్నించారు. దీంతో ఘర్షణ చోటుచేసుకుంది. తమిళశాఖలో అటెండరు భాగ్యలక్ష్మి.. తనపై కొందరు దాడిచేశారని గుడుపల్లె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిరసన చేపడుతున్న ఉద్యోగులు కూడా తాము జీతాల కోసం విధులు బహిష్కరించి పోరాడుతుంటే మాకు సహకరించకుండా మాపై తప్పుడు ఫిర్యాదు చేశారని మరో ఫిర్యాదును పోలీసులకు అందించారు. ఇంత జరుగుతున్నా... వర్సిటీ అధికారులు మాత్రం కిమ్మనకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని