logo

సమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి

వైకాపా అరాచక పాలనతో విసిగి వేశారిన ప్రజలకు ఎన్నికల రూపంలో ఇప్పుడు సరైన అవకాశం వచ్చిందని, అందరి సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే సమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ అన్నారు.

Published : 17 Apr 2024 03:13 IST

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: వైకాపా అరాచక పాలనతో విసిగి వేశారిన ప్రజలకు ఎన్నికల రూపంలో ఇప్పుడు సరైన అవకాశం వచ్చిందని, అందరి సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే సమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ అన్నారు. లక్ష్మీనగర్‌ కాలనీలోని ఓంశక్తి ఆలయంలో పూజలు చేసి 11, 14, 15 వ డివిజన్ల పరిధిలోని జోగలకాలనీ, చెన్నమ్మగుడిపల్ల్లి, ఎన్‌.ఎన్‌.కండ్రిగ, ద్వారకాపురం, గోవిందపురం, బండపల్లి, ఎల్‌.బి.పురం, చెరువుముందరకండ్రిగ, గాజులపల్లి, కురపల్లి, తిమ్మసానిపల్లి, వై.ఎస్‌.కాలనీలో మంగళవారం ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, నాయకులతో కలిసిప్రచారం చేశారు. చెన్నమ్మగుడిపల్లి, చెరువుముందరవూరులో వైకాపాను వీడి 30 కుటుంబాలు తెదేపాలో చేరారు. తిమ్మసానిపల్లిలో పలువురు పార్టీలో చేరారు. మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ మేయర్‌ కఠారి హేమలత, తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, కార్పొరేటర్‌ జయలక్ష్మి, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, తెదేపా నాయకులు శేషాద్రినాయుడు, నాగరాజునాయుడు, మధునాయుడు, మాజీ కార్పొరేటర్‌ భార్గవి, వెంకటేష్‌యాదవ్‌, రాము, కోడిబాబు, శివ పాల్గొన్నారు.

గుడిపాల: తెదేపా కూటమి అభ్యర్థి జగన్మోహన్‌ సతీమణి ప్రతిమ కుప్పిగానిపల్లె, 13.గొల్లపల్లె పంచాయతీలో ప్రచారం చేపట్టారు. గొల్లపల్లెలో వరి తూర్పార పడుతూ, కృష్ణజిమ్మాపురంలో వేరుసెనెగ కాయలు వలుస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. మాజీ జడ్పీటీసీ సుమతి, మాజీ ఎంపీపీ దీపశ్రీ పాల్గొన్నారు. నగరి: వైకాపా అరాచక పాలనతో అభివృద్ధిలో వెనకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే చంద్రబాబు తపన పడుతున్నారని తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ పేర్కొన్నారు. ఏకాంబరకుప్పంలో ప్రచారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐరాల: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేస్తున్న దాష్టీకానికి చరమగీతం పాడే సమయం దగ్గర పడిందని కూటమి అభ్యర్థి మురళీమోహన్‌ తెలిపారు. గోవిందరెడ్డిపల్లె, నయనంపల్లె, ఐకే రెడ్డిపల్లె, గొల్లపల్లెలో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. వైకాపాకు కంచుకోటైన గోవిందరెడ్డిపల్లెలో సుమారు 60 కుటుంబాలు తెదేపాలో చేరడం ఇందుకు నిదర్శనమన్నారు. ఆయా పార్టీల నాయకులు గిరిధర్‌బాబు, దేవాజీ, తులసీప్రసాద్‌, లత, మురళీ, పెరుమాళ్‌ సుబ్బారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి,  వేణుగోపాల్‌, రాజేశ్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, లోకనాథరెడ్డి, రవి, వాసు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని