logo

మానవత్వం మరిచి.. రహదారిపై వదిలేసి

మానవత్వం మరచిన తల్లి.. కన్నబిడ్డను అర్ధరాత్రి నడ్డిరోడ్డుపై వదిలేసింది. చీకట్లో బిక్కుబిక్కుమంటూ అడుగులు వేస్తున్న చిన్నారిని గుర్తించిన లారీ డ్రైవర్‌.. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఆమెను పోలీసులకు అప్పగించారు.

Published : 17 Apr 2024 03:20 IST

చిన్నారిని పోలీసులకు అప్పగించిన లారీ చోదకుడు
భర్తతో గొడవపడి తల్లి నిర్వాకం

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: మానవత్వం మరచిన తల్లి.. కన్నబిడ్డను అర్ధరాత్రి నడ్డిరోడ్డుపై వదిలేసింది. చీకట్లో బిక్కుబిక్కుమంటూ అడుగులు వేస్తున్న చిన్నారిని గుర్తించిన లారీ డ్రైవర్‌.. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఆమెను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గంగవరం మండలం పత్తికొండకు చెందిన శ్రీనివాసులు, కావేరిలది ప్రేమ వివాహం. వీరిని ఇరు కుటుంబాలు చేరదీయలేదు. ఉపాధి కోసం బెంగళూరు వెళ్లిన వీరికి నందిత (2) సంతానం. ఏడాది కిందట పలమనేరు వచ్చేశారు. శ్రీనివాసులు ట్రాక్టర్‌ పనిచేస్తున్నారు. అతనికి మద్యం వ్యసనం ఉండటంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.  తెల్లవారుజామున బైరెడ్డిపల్లె పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని బాటగంగమ్మ ఆలయం వద్ద ప్రధాన రహదారిపై రెండేళ్ల చిన్నారి తిరుగుతూ కనిపించడంతో ఓ లారీ డ్రైవర్‌ ఆమెను చేరదీసి.. సమీపంలో వెతికారు. ఎవరూ కనిపించకపోవడంతో పోలీసులకు అప్పగించారు. మంగళవారం పాప చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు వైరల్‌ చేశారు. చిన్నారి తల్లిదండ్రులు సాయంత్రం గంటలకు బైరెడ్డిపల్లె పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఎస్‌ఐ కృష్ణయ్య విచారణలో కావేరీ పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు గుర్తించారు. కౌన్సెలింగ్‌ కోసం గంగవరం సీఐ కృష్ణమోహన్‌ వద్ద కౌన్సిలింగ్‌ నిర్వహించి అపగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని