మార్కులు రాలేదని చిన్నారులను చితకబాదిన హెచ్ఎం
సమ్మెటీవ్ పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని ఐదుగురు విద్యార్థులను చితకబాదిన హెచ్ఎం వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది.
పెద్దపంజాణి: సమ్మెటీవ్ పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని ఐదుగురు విద్యార్థులను చితకబాదిన హెచ్ఎం వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని జంగాలపల్లె ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామచంద్ర 5వ తరగతి విద్యార్థులను విచక్షణారహితంగా కర్రతో చితకబాదాడు. ఈనెల 1-13 తేదీ వరకు ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహించారు. సోమవారం ఆ ఫలితాలు ఇచ్చారు. 5వ తరగతి విద్యార్థులు అంజలి, నరసమ్మ, పావని, ఉష, రక్షిత, నందీష్‌ను కర్రతో ఇష్టానుసారంగా కొట్టాడు. దీంతో వాతలు తేలాయి. ఏడుస్తూ చిన్నారులు ఇంటికి పరుగులు తీశారు. ప్రశ్నించిన తల్లిదండ్రులకు మంచి మార్కులు రాలేదని హెచ్ఎం కొట్టాడని చెప్పారు. తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకుని హెచ్ఎంను నిలదీశారు. సరైన సమాధానం రాకపోవడంతో విద్యాశాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా ఎంఈవోలు గోపాల్‌రెడ్డి, తులసీరామ్ మంగళవారం గుట్టుగా పాఠశాలను సందర్శించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ‘న్యూస్‌టుడే’ చరవాణిలో ఎంఈవోను సంప్రదించేందుకు యత్నించగా ఆయన స్పందించలేదు. కొట్టిన ఉపాధ్యాయుడ్ని బదిలీ చేయాలని లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్థులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్‌రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం