కుమారుడి కోసమే ‘కరుణ’
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్‌రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు.
తితిదే ఇళ్ల స్థలాల పంపిణీపై వైకాపా నేత కొత్తరాగం
నిబంధనలు పాటించకుండా కూటమి కుట్రగా దుష్ప్రచారం
పట్టాల ప్రదానంలో కరుణాకర్‌రెడ్డి (పాతచిత్రం)
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్‌రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరిట ఎన్నికల్లో ఆయాచిత లబ్ధిపొందాలని అర్రులు చాచినా కనీస నిబంధనలు విస్మరించడంతో కథ అడ్డం తిరిగింది. దీన్ని కప్పి పుచ్చుకునేందుకు కూటమి కుట్ర అంటూ కొత్త రాగం పాడటాన్ని అందరూ తప్పుబడుతున్నారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి..? వీరేం చేశారు..? వాస్తవమేమిటో ‘న్యూస్‌టుడే’ కథనం.
న్యూస్‌టుడే, తిరుపతి (నగరపాలిక)
వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద 3,518 మంది ఉద్యోగులకు 2023 సెప్టెంబరు 18న ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఇక్కడ రెండు విడతలుగా స్థలాలు పంచినా ముందుగా ల్యాండ్ కన్వర్షన్ పట్టించుకోలేదు. తుడా అనుమతికీ దరఖాస్తు చేయలేదు. ‘ఈనాడు’లో ఫిబ్రవరి 5న కథనం వచ్చిన తర్వాత తితిదే ఆఘమేఘాలపై తప్పు సరిదిద్దుకుంది. 29న ల్యాండ్ కన్వర్షన్ పొందడం గమనార్హం. ఆ తర్వాతా తితిదే తీరు మారలేదు.
స్థలం సేకరించకనే నిధులు
మార్చి 12న మూడో విడతగా ఏర్పేడు మండలం పల్లం వద్ద 400 ఎకరాలు సేకరించి 723 మంది ఉద్యోగులకు, 3,277 మంది పింఛనుదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇక్కడ స్థల సేకరణ పూర్తి కాకుండానే అభివృద్ధికి రూ.90 కోట్లు నిధులు కేటాయించడం గమనార్హం. దీనికి ల్యాండ్ కన్వర్షన్, తుడా అనుమతుల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఇక్కడ మరో 2,580 మంది ఉద్యోగులకు పట్టాలు అందజేస్తామని చెప్పుకొచ్చారు.
పేదలను ఎందుకు ఉద్దరించలేకపోయారో?
తిరుపతిలోని పేదలకు 2020 డిసెంబరులో జగనన్న ఇంటి పట్టాలు పంపిణీ చేయగా.. సుమారు ఆరు వేల మంది ఇప్పటివరకు ఇంటి స్థలాలు కళ్లజూడలేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. తాము చేకూర్చిన లబ్ధి ‘రూ.6 లక్షలు విలువైన సెంటు స్థలం’ అంటూ వైకాపా నేతలు వారి ఇంటికి పంపే కరపత్రం చూసి కన్నీళ్లు పెట్టుకుంటు న్నారు. ఇప్పుడైనా ఇంటి జాగా చూద్దామంటే తిరుపతికి 30-35 కి.మీ దూరం ఉండటం, అక్కడికి బస్సు సౌకర్యం లేకపోవడం.. కష్టపడి వెళ్లినా లేఆవుట్‌లో కనీసం హద్దు రాళ్లు లేకపోవడంతో వైకాపా నేతల మోసాన్ని తలచుకుని మదనపడుతున్నారు. రూ.3 లక్షలతో పేదల కంటే మూడు రెట్లు అధిక విస్తీర్ణం ఉన్న ప్లాట్ తీసుకున్నామన్న సంతోషం తమకు ఎక్కువ కాలం ఉండేలా లేదని తితిదే ఉద్యోగులకు అర్థమైంది. ఈ క్రమంలో వారి నుంచి వ్యతిరేకత రాకుండా వైకాపా నేతలు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
నాలుగో విడత కూడా అంతేనా?
పల్లం వద్ద మరో వంద ఎకరాల భూమికి అదనంగా 200 ఎకరాలు కొనుగోలు చేసి నాలుగో విడత పట్టాలు అందజేస్తామని తితిదే ప్రకటించింది. ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలకు రూ.240 కోట్లు వ్యయం చేయగా.. తితిదే ఉద్యోగుల నుంచి రూ.వంద కోట్ల వరకు సేకరిం చినట్లు సమాచారం.
అధ్యక్షా.. మోసగిస్తున్నదెవరు?
ఇంటి నిర్మాణానికి స్థలం కొనుగోలు చేసినప్పుడు దాని మాస్టర్‌ప్లాన్‌లో వ్యవసాయ, పారిశ్రామిక, రహదారి అవసరాల విభాగంలో ఉందా? నిషేధిత భూముల జాబితాలో ఉందో గుర్తించాలి. దానికి అనుగుణంగా తుడాకు నివేదించి భూమి స్థితి మార్చేందుకు దరఖాస్తు చేయాలి. ఆపై అప్రూవల్ పొందిన తర్వాతే పట్టాలివ్వాలి. ఇవేవీ చేయకుండా నేరుగా పట్టాలివ్వడం పట్టణాభివృద్ధి సంస్థల నిబంధనలకు విరుద్ధం. తితిదే ఈ ప్రక్రియ పాటించిందా.. అధ్యక్షా మీరే చెప్పాలి? ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హడావుడిగా, ఆర్భాటంగా ఇస్తున్న ప్రొసీడింగ్స్ జగనన్న కాలనీల తరహాలో ఏళ్ల తరబడి సమస్యాత్మకంగా ఉంచాలన్నదే మీ లక్ష్యమా..? అని తితిదే ఉద్యోగులు, విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం