logo

గమ్యం చేరేలోగా మృత్యుఒడికి..

ఉద్యోగోన్నతిపై ఉత్తరాఖండ్‌ వెళ్తూ పెనుమూరు మండలం గుంటిపల్లె పంచాయతీ కనికాపురం గ్రామానికి(చిత్తూరు సమీప మురకంబట్టు) చెందిన సైనికుడు రైలు నుంచి జారిపడి మృతిచెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది.

Published : 20 May 2024 02:04 IST

రైలు నుంచి పడి సైనికుడి దుర్మరణం

చంద్రశేఖర్‌రెడ్డి (పాత చిత్రం)

పెనుమూరు, న్యూస్‌టుడే: ఉద్యోగోన్నతిపై ఉత్తరాఖండ్‌ వెళ్తూ పెనుమూరు మండలం గుంటిపల్లె పంచాయతీ కనికాపురం గ్రామానికి(చిత్తూరు సమీప మురకంబట్టు) చెందిన సైనికుడు రైలు నుంచి జారిపడి మృతిచెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, బంధువుల కథనం మేరకు.. కనికాపురం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యంరెడ్డి కుమారుడు టి.చంద్రశేఖర్‌రెడ్డి(42) బెంగుళూరులో సైన్యంలో సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఉద్యోగోన్నతి లభించడంతో ఉత్తరాఖండ్‌కు బదిలీ చేశారు. బెంగళూరు నుంచి రైలులో దిల్లీకి వెళ్లి.. అక్కడి నుంచి మరో రైలులో ఉత్తరాఖండ్‌కు బయలుదేరాడు. మరి కొద్దిసేపట్లో తన గమ్యస్థానం చేరుకోనుండటంతో రైలు ఫుట్‌బోర్డు వద్దకు వచ్చి అక్కడి సైనికులకు చరవాణిలో తాను కొద్దిసేపట్లో చేరుకుంటానని సమాచారం ఇచ్చారు. బిలాస్‌పూర్‌ వద్ద అదుపుతప్పి రైలు నుంచి కిందపడి మృతి చెందినట్లు తెలిసింది. సహచరులు కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని