logo

ముగిసిన శ్రీపద్మావతి పరిణయోత్సవాలు

శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిశాయి. సాయంత్రం శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.

Published : 20 May 2024 02:09 IST

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి ఊంజల్‌ సేవ

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిశాయి. సాయంత్రం శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందు రెండురోజుల మాదిరే శ్రీ స్వామివారు, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలమాలల మార్చడం, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తైన తరువాత కొలువు జరిగింది. అనంతరం శ్రీవారు దేవేరులతో బంగారు తిరుచ్చిపై తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల శ్రీపద్మావతి పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మాడవీధుల్లో గరుడవాహనంపై శ్రీమలయప్పస్వామి, బంగారు పల్లకీలో ఉభయదేవేరులు, చిత్రంలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని