logo

ఏడు గంటలపాటు.. సిట్‌ విచారణ

చంద్రగిరి నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లె, కూచువారిపల్లెలో పోలింగ్‌ రోజున జరిగిన గొడవలు, ఎన్నికల అనంతరం శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద జరిగిన దాడుల ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఏర్పాటైన సిట్‌ బృందం ఆదివారం సుమారు ఏడుగంటలపాటు విచారణ చేపట్టింది.

Published : 20 May 2024 02:10 IST

ఎస్వీయూ పీఎస్‌లో దస్త్రాలు పరిశీలిస్తున్న డీఎస్పీ రవి మనోహరాచారి తదితరులు 

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: చంద్రగిరి నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లె, కూచువారిపల్లెలో పోలింగ్‌ రోజున జరిగిన గొడవలు, ఎన్నికల అనంతరం శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద జరిగిన దాడుల ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఏర్పాటైన సిట్‌ బృందం ఆదివారం సుమారు ఏడుగంటలపాటు విచారణ చేపట్టింది. ఏసీబీ డీఎస్పీ రవి మనోహరాచారి, సీఐ ప్రభాకర్‌ ఉదయం పది గంటలకు ఎస్వీయూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. వాహనాల తనిఖీపై సీఐ మురళీమోహన్‌ను ప్రశ్నించారు.  ఉదయం 11 గంటల ప్రాంతంలో మహిళా యూనివర్సిటీలో పర్యటించారు.  కొందరు పోలీసు అధికారులు, సాక్షులను విచారించారు. అనంతరం చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచువారిపల్లెలో పర్యటించారు. ఘటనలపై అదనపు సెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉండటంతోపాటు మరికొందరిపై కేసులు నమోదు కానున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీకి చెందిన పలువురిలో ఆందోళన నెలకొంది. లోతైన దర్యాప్తు నిమిత్తం సోమవారం తిరుపతిలోనే సిట్‌ బృందం ఉంటుందనే సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని