logo

తల తీసేస్తా..!

శ్రీకాళహస్తీశ్వరాలయంలో విధి నిర్వహణలో ఉన్న హోంగార్డును తల తీసేస్తానంటూ ఒప్పంద ఉద్యోగి బెదిరించడం చర్చనీయాంశంగా మారింది.

Published : 21 May 2024 03:11 IST

ముక్కంటి ఆలయ హోంగార్డుకు ఒప్పంద ఉద్యోగి బెదిరింపులు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో విధి నిర్వహణలో ఉన్న హోంగార్డును తల తీసేస్తానంటూ ఒప్పంద ఉద్యోగి బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ అండదండలతో ఒప్పంద ఉద్యోగిగా చేరిన అతని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేసవి సెలవుల కారణంగా సోమవారం ముక్కంటి ఆలయం భక్తజనసంద్రంగా మారింది. రద్దీ నియంత్రణను డిప్యూటీ ఈవో ఏకాంబరం పర్యవేక్షిస్తున్నారు. ఈయన వద్ద సహాయకునిగా పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగి సునీల్‌ హోంగార్డును రద్దీని నియంత్రించే క్రమంలో బెదిరింపులకు గురిచేశారు. సంబంధిత హోంగార్డు వైర్‌లెస్‌ సెట్‌ ద్వారా విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఒప్పంద ఉద్యోగిని మందలించి అక్కడి నుంచి పంపేశారు. అలాగే క్లీనర్‌గా పనిచేస్తున్న మరో ఒప్పంద ఉద్యోగి సీనియర్‌ ఉద్యోగుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో ఒప్పంద ఉద్యోగులుగా చేరిన వీరు స్థాయిని విస్మరించి వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి తారస్థాయికి చేరకముందే వారి అత్యుత్సాహానికి ఉన్నతాధికారులు కళ్లెం వేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని