logo

చక్కెర, గోధుమపిండి అరకొరగా..

ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఇంటి వద్దకే బియ్యం పంపిణీ ఆర్భాటాలే తప్ప క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులున్నాయి.

Published : 21 May 2024 03:12 IST

కందిపప్పు అసలే లేదు
అస్తవ్యస్తంగా ప్రజా పంపిణీ

చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే: ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఇంటి వద్దకే బియ్యం పంపిణీ ఆర్భాటాలే తప్ప క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులున్నాయి. సరకులు పొందడంలో లబ్ధిదారుల అవస్థలు వర్ణనాతీతం. మే నెలలో బియ్యం పూర్తిగా అందజేయగా.. చక్కెర అరకొరగా.. గోధుమపిండి, రాగి పిండి నామమాత్రంగా, కందిపప్పు పూర్తిగా ఆపేశారు. బియ్యం ఒక్కటే అందజేస్తున్నారే తప్ప.. చక్కెర, కందిపప్పు ఎందుకివ్వరంటూ  పలు ప్రాంతాల్లో డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లను కార్డుదారులు ప్రశ్నించడం చోటుచేసుకుంది.

64,403 కార్డులకు అందని సరకులు

జిల్లాలో మే నెల కోటా బియ్యం పంపిణీ గడువు శనివారంతో ముగిసింది. 5.43 లక్షల కార్డులుండగా.. 4.87 లక్షల కార్డులకు సరకులు అందజేసి 88.14 శాతం పూర్తిచేశారు. ఈ లెక్కన జిల్లాలో 64,403 కార్డుదారులకు సరకులు చేరలేదు. ఎందుకు తీసుకోలేదు? అందుబాటులో ఉన్నారా లేదా..? అందుబాటులో ఉండి తీసుకోలేదా? తదితర అంశాలను క్షేత్రస్థాయి పరిశీలించాల్సిన అధికారులు దృష్టిసారించకపోవడం శోచనీయం. ఎండీయూ వాహనాల పనితీరు ఇష్టానుసారం వల్ల బియ్యం ఎప్పుడిస్తారో తెలియక అధిక శాతం మంది లబ్ధిదారులకు సరకులు దూరమవుతున్నాయని కార్డుదారులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని