logo

ఇసుక అక్రమంగా తరలిస్తుంటే ఏం చేస్తున్నారు?

మండల పరిధి ఓ.జి.కుప్పం వద్ద కుశస్థలి నదిలో ఇసుక అక్రమంగా రవాణా జరగకుండా హెచ్చరిక బోర్డులు పెట్టాలని, దండోరా వేయించాలని జేసీ పి.శ్రీనివాసులు ఆదేశించారు.

Published : 21 May 2024 03:15 IST

ఓజీ కుప్పం వద్ద గ్రామస్థులతో మాట్లాడుతున్న జేసీ శ్రీనివాసులు, అధికారులు

నగరి, న్యూస్‌టుడే: మండల పరిధి ఓ.జి.కుప్పం వద్ద కుశస్థలి నదిలో ఇసుక అక్రమంగా రవాణా జరగకుండా హెచ్చరిక బోర్డులు పెట్టాలని, దండోరా వేయించాలని జేసీ పి.శ్రీనివాసులు ఆదేశించారు. ఓ.జి.కుప్పం ఇసుక రీచ్‌ని ఆయన భూగర్భ గనుల శాఖ, కాలుష్య  నివారణ బోర్డు, సెబ్, ఇరిగేషన్, రవాణా, రెవెన్యూ అధికారులతో కలసి సోమవారం పరిశీలించారు. గ్రామస్థులను పిలిచి వాస్తవ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 2022 సంవత్సరంతోనే ఇసుక రీచ్‌ గడువు ముగిసిందని, అయినా ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ రీచ్‌ నుంచి ఇసుక తరలించరాదని, హద్దుమీరి తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం సూచనలతో జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన 14 ఇసుక రీచ్‌లను సంబంధిత శాఖ అధికారులతో కలసి పరిశీలించామన్నారు. ఈ 14 రీచ్‌ల గడువు పూర్తయ్యిందని,  మరెక్కడా వాగులు, వంకల్లో ఇసుక అక్రమ రవాణా జరగకూడదని ఆయన తెలిపారు.

చిత్తూరు (గ్రామీణ), గంగాధరనెల్లూరు, న్యూస్‌టుడే: చిత్తూరు మండలం, గంగాధరనెల్లూరు నీవానది పరివాహక ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌ల్ని జేసీ శ్రీనివాసులు పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని