logo

వైభవంగా అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం

కుప్పం గ్రామదేవత శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో భాగంగా సోమవారం రాత్రి శ్రీప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు.

Published : 21 May 2024 03:18 IST

జోరు వర్షంలోనూ అమ్మవారి ఆగమనం 

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పం గ్రామదేవత శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో భాగంగా సోమవారం రాత్రి శ్రీప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. జోరుగా వర్షం కురుస్తున్నా ఎటువంటి ఆటంకం లేకుండా కార్యక్రమం నిర్వహించారు.  పెద్దబావి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో ముత్తుమారెమ్మ అమ్మవారి కళ్ల తెర తొలగించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండ ప్రవేశం ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. సాంప్రదాయ పూజలు చేసి మొదట పచ్చి గెరిగ, అమ్మవారి ఆయుధాలతో భక్తులు, తరువాత అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఆ సమయంలో భక్తుల అమ్మా తల్లీ.. గంగమ్మా.. కరుణించమ్మా.. కాపాడమ్మా.. అంటూ గంగమ్మ, ముత్తుమారెమ్మ నామస్మరణలతో మారుమోగింది.

అగ్నిగుండప్రవేశం చేస్తున్న అమ్మవారు, పచ్చిగెరిగ, భక్తులు

వర్షంలోనూ జనసంద్రం..: ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు మూడు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో స్థిరపడిన అమ్మవారి భక్తులు వేలాదిగా తరలిరావడంతో పట్టణం జనసంద్రంగా మారింది. అగ్నిగుండ ప్రవేశ ప్రాంగణంలో భక్తులు అమ్మవారి వెంట రావడంతో కొంత పోలీసులు, భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రవేశ స్థలం పరిసరాల్లోని భక్తులు భారీ ఎత్తున భవనాలు ఎక్కి తిలకించారు. జాతరలో భాగంగా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై డీఎస్పీ శ్రీనాథ్‌ పోలీసు సిబ్బంది సూచనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు