logo

జననీ.. పావనీ.. పాహిమాం

జగజ్జననీ.. లోకనాయకి.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన గంగమ్మ జాతర వేడుకలకు చిత్తూరు నగరం సర్వసన్నద్ధమైంది.

Published : 21 May 2024 03:19 IST

చిత్తూరులో నేటి నుంచి గంగమ్మ జాతర

చిత్తూరు (క్రీడలు), న్యూస్‌టుడే: జగజ్జననీ.. లోకనాయకి.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన గంగమ్మ జాతర వేడుకలకు చిత్తూరు నగరం సర్వసన్నద్ధమైంది. పండుగ నేపథ్యంలో ప్రతి ఇంటా బంధుగణం.. ఊరంతా కోలాహల వాతావరణం నెలకొంది.  చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర సంబరాలు మంగళవారం మొదలు కానున్నాయి. ఉదయం 5 గంటల నుంచి అమ్మవారి దర్శన సేవలు ప్రారంభమవుతాయి. జాతర వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకేబాబు అమ్మవారికి తొలి హారతి ఇవ్వనున్నారు. బజారువీధిలో రద్దీ నియంత్రణకు క్యూలైన్లు సిద్ధం చేశారు. భక్తులు నైవేద్యం సమర్పించేందుకు పెద్ద బాణల్ని ఏర్పాటు చేశారు.

నడివీధి గంగమ్మను ప్రతిష్ఠించే మండపం వద్ద స్వాగత ఆర్చి

అమ్మవారి ప్రతిష్ఠాపన ఇలా..: కుమ్మర కులస్థులు తెచ్చిన బంకమట్టికి పసుపు కుంకుమ కలిపి గంగమ్మ ప్రతిమ రూపొందించి సింహ వాహనంపై అధిష్ఠింపజేస్తారు. దర్జీ కుటుంబం అమ్మవారికి దుస్తుల్ని, విశ్వబ్రహ్మణ కులస్థులు మంగళసూత్రాన్ని, రజక కులస్థులు తొలి నైవేద్యంగా రాగి అంబలి సమర్పిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని