logo

ఎన్నికల సాకు.. అక్రమ తవ్వకాలకు అడుగు

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి, నిశ్శబ్దవాతావరణానికి తోడు, బదిలీలపై వచ్చిన అధికారుల ఉదాసీనవైఖరి అక్రమార్కుల పాలిట శాపంగా మారుతోంది.

Published : 26 May 2024 02:03 IST

నరసరాజుఅగ్రహారంలో చెరువులో మట్టి తవ్వకాలు

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి, నిశ్శబ్దవాతావరణానికి తోడు, బదిలీలపై వచ్చిన అధికారుల ఉదాసీనవైఖరి అక్రమార్కుల పాలిట శాపంగా మారుతోంది. మండలంలోని నరసరాజుఅగ్రహారంలో చెరువు నుంచి మట్టిని జేసీబీల సాయంతో అక్రమంగా తరలించి లక్షలు పోగేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ విషయమై జలవనరులశాఖ డీఈ మదన్‌గోపాల్‌ను వివరణ కోరగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఎక్కడా మట్టితవ్వకాలకు అనుమతులు లేవన్నారు. నరసరాజుఅగ్రహారంలోని చెరువులో మట్టితవ్వకాలపై విచారించి చర్యలు తీసుకుంటాం.

 న్యూస్‌టుడే, సత్యవేడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు