logo

ఓటమి భయంతోనే వైకాపా అరాచకాలు

ఓటమి భయంతోనే వైకాపా నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సి.ఆర్‌.రాజన్‌ అన్నారు.

Published : 26 May 2024 02:14 IST

పులివర్తి నానితో మాట్లాడుతున్న తెదేపా నేతలు

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: ఓటమి భయంతోనే వైకాపా నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సి.ఆర్‌.రాజన్‌ అన్నారు. చిత్తూరు నగరంలోని బీవీరెడ్డి కాలనీలో చంద్రగిరి నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని.. ఆయన నివాసంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పలువురు నేతలతో కలిసి పరామర్శించారు. ఇటీవల తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద జరిగిన దాడిలో గాయపడిన నాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దాడి జరిగిన తీరు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జూన్‌ నాలుగో తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెదేపా నేతలపై దాడులు చేయించిన వారిని, వారికి సహకరించిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. నానిని పరామర్శించిన వారిలో పార్టీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి చిన్నస్వామి, వన్నియకుల క్షత్రియ సంఘం నాయకుడు విజయకుమార్, నాయకులు జయచంద్రనాయుడు, అమరేంద్ర, దేవా తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు