logo

పారితోషికం ఎప్పుడిస్తారు సార్‌..!

జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించిన అధికారులకు ఇప్పటివరకు పారితోషికం అందక పోవడంతో ఆవేదనకు లోనవుతున్నారు.

Published : 26 May 2024 02:21 IST

ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగుల ఆవేదన

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించిన అధికారులకు ఇప్పటివరకు పారితోషికం అందక పోవడంతో ఆవేదనకు లోనవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించినప్పటి నుంచి పలు శాఖలకు సంబంధించిన అధికారులు సెక్టార్‌ అధికారులుగా, రూట్‌ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తించారు. వీరు పారితోషికం కోసం నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులకు విన్నవిస్తున్నా స్పందన లేకపోవడం గమనార్హం. కొన్ని నియోజకవర్గాల్లో సెక్టార్‌ ఆఫీసర్లు, రూట్‌ ఆఫీసర్లకు ఇప్పటివరకు రెమ్యునరేషన్‌ అందలేదు. ఈవీఎం కమిషనింగ్‌ రోజున రెమ్యునరేషన్‌ గురించి ఆర్వోల దృష్టికి తీసుకెళ్లగా.. ఈ నెల 15 తర్వాత అందరికీ చెల్లిస్తామని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత 10 రోజులు గడిచినా అతీగతీ లేదు. ఇతర జిల్లాల్లో ఒక్కొక్కరికీ రూ.20 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చిన అక్విటెన్స్‌ను అధికారులకు చూపినా పట్టించుకోలేదని సమాచారం. దీంతో ఎన్నికల విధులు నిర్వర్తించిన అధికారులకు ఆవేదన తప్ప ఏం మిగల్లేదు. పారితోషికం చెల్లింపులపై ఉన్నతాధికారులు సమీక్షించాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని