logo

పోలీస్‌స్టేషన్‌ వద్ద వైకాపా నేతల వీరంగం

తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేశారని వైకాపా శ్రేణులు శనివారం రాత్రి రామకుప్పం పోలీస్‌ స్టేషన్‌ వద్ద వీరంగం సృష్టించాయి.

Published : 26 May 2024 02:22 IST

పోలీసులతో వాగ్వాదానికి దిగిన వైకాపా శ్రేణులు

కుప్పం, రామకుప్పం: తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేశారని వైకాపా శ్రేణులు శనివారం రాత్రి రామకుప్పం పోలీస్‌ స్టేషన్‌ వద్ద వీరంగం సృష్టించాయి. స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లాయి. 89.పెద్దూరు పంచాయతీ వైకాపా కన్వీనర్‌ మణికుమార్‌కు చెందిన పొలంలో విద్యుత్తు తీగల ఏర్పాటుపై నిలదీయడంతో తెదేపా వారు దాడులకు పాల్పడ్డారన్నారు. శేషాద్రి ఫిర్యాదు మేరకు కేసులు పెట్టడం తగదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్‌ స్టేషను వద్ద గొడవలు సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడంతో వారు వెనుదిరిగారు. మరోసారి పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వచ్చిన వైకాపా శ్రేణులు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను దూషించాయి. తెదేపా మండల అధ్యక్షుడు ఆనందరెడ్డి వారిని నిలువరించడానికి యత్నించగా.. ఆయనపైనా వారు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తెదేపా శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడకు రావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు వారిని చెదరగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని