logo

వెలుగులెక్కడ పెద్దాయనా..?

నా ఎస్సీలు, నా ఎస్టీలని చెప్పే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు అన్నింటా అన్యాయం చేస్తున్నారు.. ఎ ముగియడంతో ఎస్సీ, ఎస్టీ విద్యుత్తు కనెక్షన్లపై దృష్టి సారించారు.. అది ఉచిత విద్యుత్తు కనెక్షన్‌ అయినా పరిమితికి మించి వినియోగిస్తే బకాయి మొత్తం కట్టాల్సిందేనని, లేదంటే కనెక్షన్‌ తొలగిస్తామని హుకుం జారీ చేశారు.

Published : 26 May 2024 02:32 IST

ఉచిత కనెక్షన్లకు బకాయిల షాక్‌
నిబంధనల పేరుతో లబ్ధిదారుల్లో కోత
ఎస్సీ, ఎస్టీల గృహాల్లో ఊసేలేని ఉచిత విద్యుత్తు
న్యూస్‌టుడే, చిత్తూరు(జిల్లా పంచాయతీ)న్నికలు

నా ఎస్సీలు, నా ఎస్టీలని చెప్పే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు అన్నింటా అన్యాయం చేస్తున్నారు.. ఎ ముగియడంతో ఎస్సీ, ఎస్టీ విద్యుత్తు కనెక్షన్లపై దృష్టి సారించారు.. అది ఉచిత విద్యుత్తు కనెక్షన్‌ అయినా పరిమితికి మించి వినియోగిస్తే బకాయి మొత్తం కట్టాల్సిందేనని, లేదంటే కనెక్షన్‌ తొలగిస్తామని హుకుం జారీ చేశారు.. గత ప్రభుత్వం కంటే మిన్నగా ఉచిత విద్యుత్తు అందిస్తామని ఊదరగొట్టిన వైకాపా ప్రభుత్వం రాయితీలో దశల వారీగా కోత పెట్టింది.. తీరా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిశాక ఏకంగా ఆయా కనెక్షన్లకే ఎసరు పెట్టి సదరు వర్గాలకు షాక్‌ ఇస్తోంది.

ఎస్సీ కాలనీల్లోని ఉచిత విద్యుత్తు వినియోగదారులకు ఎస్పీడీసీఎల్‌ షాక్‌ ఇస్తోంది. పలువురు లబ్ధిదారులు రూ.వేలకు వేలు బిల్లులు చూసి అవాక్కవుతున్నారు. బిల్లులేమీ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి.. తీరా ఇప్పుడు బకాయిలు నెపంతో కనెక్షన్లు తొలగిస్తామంటే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు విద్యుత్తు రాయితీ అమలులో కోతల వాత తప్పడం లేదు. విద్యుత్తు రాయితీ పరిమితి పెంచామంటూనే లబ్ధిదారుల సంఖ్యలో కోత పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఉచిత విద్యుత్తుకు అర్హత కోల్పోయి, వినియోగ పరిమితి దాటేసినందున, ఉచిత విద్యుత్తు అమలు వర్తించదని, ఏళ్లుగా పేరుకు పోయిన విద్యుత్తు బిల్లుల చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్‌) పరిధిలో ఉమ్మడి జిల్లాలో 13.73 లక్షల గృహ వినియోగ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. అందులో ఎస్సీ, ఎస్టీల గృహ విద్యుత్తు కనెక్షన్లు 3.43 లక్షలు ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2,47,683 మంది ఉచిత విద్యుత్తుకు అర్హత పొందితే, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 1.94 లక్షలకు తగ్గింది. ఉమ్మడి జిల్లాలో నెలకు 200 యూనిట్లుకు మించిన విద్యుత్తు వినియోగ కనెక్షన్లు గుర్తించారు. మొత్తం 23,458 మంది వినియోగదారులు రూ.8 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తేల్చారు.

ఉచితం అంతా ఉత్తిదే..

గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్తు అమలు చేస్తే ఎన్నికల హామీలో భాగంగా జగన్‌ ప్రభుత్వం 200 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్తును 2019 ఆగస్టు నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎస్పీడీసీఎల్‌ ఖజానా నుంచి రూ.కోట్లు నిధులు జగనన్న కాలనీల్లో విద్యుత్తు ఉప కేంద్రాలు, ఇతరత్రా పనులకు ప్రభుత్వం మళ్లించడంతో సంస్థ మనుగడకు ఇలాంటి బకాయిలే దిక్కయ్యాయి. ఎన్నికల వరకూ మిన్నకుండిన యంత్రాంగం తీరా ఇప్పుడు  ఎన్నికలయ్యాక బకాయిలు చెల్లించకపోతే విద్యుత్తు సరఫరా తొలగిస్తామని ఝలక్‌ ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లూ చూపింది ఉత్తుత్తి ప్రేమేనని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అర్హులకు ఉచిత ప్రయోజనం కలిగిస్తున్నాం..

ప్రభుత్వ నిబంధనలు అనుసరించి అర్హులైన వారందరికీ ఉచిత విద్యుత్తు ప్రయోజనాన్ని కల్పిస్తు న్నాం. ఎవరైనా అనర్హులంటే వారి నుంచి మాత్రమే బిల్లులు వసూలు చేస్తాం.పేదవారైన ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఉచిత విద్యుత్తు అందుతుంది.

కృష్ణారెడ్డి, ఎస్‌ఈ, తిరుపతి
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు