logo

నగరి ప్రథమాన.. చిత్తూరు చివరన..!

పుర, నగర ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం పెంపునకు అధికార యంత్రాంగం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. ఓటింగ్‌ 90 శాతాన్ని చేరుకోలేకపోయాయి.. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు పట్టణ, పుర ప్రాంతాల్లో విస్తృతంగా స్వీప్‌ కార్యక్రమాలు చేపట్టారు..

Published : 27 May 2024 02:42 IST

ఓటర్ల సంఖ్యలో చిత్తూరు టాప్‌..
పోలింగ్‌ శాతంలో మాత్రం చివరన
జిల్లాలోని పుర, నగర ప్రాంతంలో పోలింగ్‌ సరళి ఇలా..

చిత్తూరులోని పోలింగ్‌ కేంద్రంలో క్యూలైన్‌లో ఓటర్లు (పాత చిత్రం) 

న్యూస్‌టుడే, చిత్తూరు కలెక్టరేట్‌: పుర, నగర ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం పెంపునకు అధికార యంత్రాంగం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. ఓటింగ్‌ 90 శాతాన్ని చేరుకోలేకపోయాయి.. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు పట్టణ, పుర ప్రాంతాల్లో విస్తృతంగా స్వీప్‌ కార్యక్రమాలు చేపట్టారు.. జిల్లాలో మూడు పురపాలక సంస్థల పరిధిలో మాత్రమే పోలింగ్‌ 80 శాతాన్ని అధిగమించింది.. మిగిలిన చోట్ల గణాంకాలు 77 నుంచి 79 శాతం లోపే ఉన్నాయి. జిల్లాలోని నగరి పురపాలక పరిధిలో అత్యధిక పోలింగ్‌ జరిగింది.. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో అతి తక్కువ పోలింగ్‌ శాతం నమోదైంది. 

ఓటర్ల లెక్క చిత్తూరులోనే ఎక్కువ.. 

పుర ప్రాంతాలను పరిశీలించగా చిత్తూరు నగరంలోనే అత్యధిక ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో పురుషల సంఖ్య, మహిళల సంఖ్య పరంగా చూసినా చిత్తూరే టాప్‌. కానీ పోలింగ్‌ నమోదులో మాత్రం చివరన నిలిచింది. అధికారులు పోలింగ్‌ శాతం పెంపునకు ఎన్ని ఫ్లెక్సీలు పెట్టినా.. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. పోలింగ్‌ శాతంలో మాత్రంలో మొదటి మూడు స్థానాలనూ చేరుకోలేకపోవడం గమనార్హం.

  • నగరి పురపాలక పురుష ఓటర్లు 23,847 మందికాగా 20,081 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించు కున్నారు. స్త్రీ ఓటర్లు 24,176 మంది కాగా 20,421 మంది ఓటు వేశారు.
  • కుప్పంలో పురుషులు 18,721. పోలైనవి 15,703. స్త్రీలు 20,294. పోలైనవి 16,917.
  • పుత్తూరులో పురుషులు 19,354. పోలైనవి 16,187. స్త్రీలు 20,663. పోలైనవి 17,101.
  • పుంగనూరులో పురుషులు 21,102. పోలైనవి 16,887. స్త్రీలు 22,517. పోలైనవి 17,970.
  • పలమనేరులో పురుషులు  20,264. పోలైనవి 16,004. స్త్రీలు 21,306. పోలైనవి 16,773.
  • చిత్తూరు నగరపాలక పరిధిలో పురుషులు 69,391. పోలైనవి 54,197. స్త్రీలు 73,864. పోలైనవి 57,208.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని