logo

విరిగిన కుర్చీలు.. తిరగని పంకాలు

ప్రభుత్వ ఆదాయంలో ఆర్టీసీది కీలకపాత్రే.. ఏరోజుకారోజు ధనరూపంలో వచ్చే ఆదాయం ఆర్టీసీది. నిత్యం వేలమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

Published : 27 May 2024 02:44 IST

ఛార్జీలు బాది సౌకర్యాలు మరిచిన వైకాపా ప్రభుత్వం

 

చిత్తూరులో కూర్చునేది ఎలా?

ఈనాడు, చిత్తూరు, న్యూస్‌టుడే, కొంగారెడ్డిపల్లి, కుప్పం, పలమనేరు: ప్రభుత్వ ఆదాయంలో ఆర్టీసీది కీలకపాత్రే.. ఏరోజుకారోజు ధనరూపంలో వచ్చే ఆదాయం ఆర్టీసీది. నిత్యం వేలమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మూడుసార్లు ఛార్జీలు పెంచడంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణ సమయాల్లో బస్టాండుల్లో కాసింత ఉపశమనం పొందాలనుకున్నా కనీస వసతులు కొరవడ్డాయి. చిత్తూరు బస్టాండులో పంకాలు తిరగక, విరిగిన కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన టీవీలు మాయమయ్యాయి. దప్పిక తీర్చుకోవాలన్నా నీరు కొనాల్సిందే. డొక్కు బస్సులతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. 

చిత్తూరు బస్టాండులో టీవీలు మాయం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని