logo

పోస్టల్‌ బ్యాలెట్లలో.. ఆధిక్యం ఎవరిదో?

గతేడాది ఎన్నికలతో పోలిస్తే ఈ విడత సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. అభ్యర్థులు నువ్వా? నేనా? అనే రీతిలో తలపడ్డారు. దీంతో గెలుపుపై ఎవరి అంచనాల్లో వారున్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో ప్రతిఓటూ కీలకమే.

Published : 27 May 2024 02:57 IST

జిల్లాలో పోలైన ఓట్లు 22,957 
కౌంటింగ్‌కు 18 టేబుళ్లు 
ప్రతి టేబుల్‌కి 1,276 ఓట్ల లెక్కింపు

పీవీకేఎన్‌ ప్రభుత్వ కళాశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి క్యూ కట్టిన ఉద్యోగులు (పాత చిత్రం) 

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: గతేడాది ఎన్నికలతో పోలిస్తే ఈ విడత సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. అభ్యర్థులు నువ్వా? నేనా? అనే రీతిలో తలపడ్డారు. దీంతో గెలుపుపై ఎవరి అంచనాల్లో వారున్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో ప్రతిఓటూ కీలకమే. ఈసారి ప్రతి ఓటూ ప్రధాన పాత్ర పోషించనుంది. ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ విడత అత్యధికంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపులో తొలుత వీటినే చేపట్టనున్నారు. వీరి తీర్పు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే జూన్‌ నాలుగో తేదీ వరకు ఆగాల్సిందే.

గత ఎన్నికల కన్నా రెట్టింపు..

ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, అత్యవసర సేవల ఉద్యోగుల కోసం ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 ఎన్నికల్లో జిల్లాలోని పుంగనూరు, నగరి, జీడీనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో మొత్తం 10,023 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల కన్నా రెట్టింపు సంఖ్యలో ఈ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవడం విశేషం. తాజాగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా పోలైన ఓట్లు 22,957. కొన్ని కారణాలతో ఇంకా కొందరు తమ ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. ఓట్ల లెక్కింపు రోజున ఏ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలపై స్పష్టత రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని