logo

నారికేళ అలంకరణలో కల్పవల్లి

భక్తుల పాలిట కల్పవల్లిగా.. ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన తాతయ్యగుంట గంగమ్మ మంగళవారం నారికేళ అలంకరణలో దర్శనమిచ్చారు.

Published : 29 May 2024 01:44 IST

తిరుపతి(బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: భక్తుల పాలిట కల్పవల్లిగా.. ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన తాతయ్యగుంట గంగమ్మ మంగళవారం నారికేళ అలంకరణలో దర్శనమిచ్చారు. జాతర అనంతరం వచ్చే మొదటి మంగళవారం సందర్భంగా అమ్మవారితోపాటు గర్భగుడిని కొబ్బరికాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. అమ్మవారికి పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ వేషధారణల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయంలో భక్తుల రద్దీ

పొంగలి తెస్తున్న భక్తురాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని