logo

అల్లరిమూకలపై కాఠిన్యం

కౌంటింగ్‌ నేపథ్యంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలిలో మంగళవారం ఎస్పీ మణికంఠ చందోలు ఆధ్వర్యంలో పోలీసులు మాక్‌డ్రిల్‌ నిర్వహించారు.

Published : 29 May 2024 01:54 IST

చిత్తూరులో పోలీసుల మాక్‌ డ్రిల్‌

మాక్‌డ్రిల్‌ వీక్షిస్తున్న ఎస్పీ, పోలీసు అధికారులు, సిబ్బంది

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: కౌంటింగ్‌ నేపథ్యంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలిలో మంగళవారం ఎస్పీ మణికంఠ చందోలు ఆధ్వర్యంలో పోలీసులు మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. అల్లర్లు, ఆందోళనలు, రౌడీయిజానికి ఎవరైనా పాల్పడితే వారిపై చర్యలు తీసుకుని చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి ఎలా తెస్తారనేది ప్రత్యక్షంగా చేసి చూపారు. మాక్‌డ్రిల్‌లో భాగంగా ఓవైపు పోలీసులు మఫ్టీలో ఆందోళన చేస్తుంటే, మరోవైపు యూనిఫాంలో ఉన్నవారు.. ఆందోళనకారులపై ఎలా స్పందించి నియంత్రించారనేది చేసి చూపిన విధానం స్థానికులను ఆకట్టుకుంది.చివరకు గాయపడిన వారిని రక్షించి, అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లే సన్నివేశం ఆకర్షించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడి వీక్షించారు. ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపే కీలకమని, ఆ సమయంలో అల్లర్లు, విధ్వంసాలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకే మాక్‌డ్రిల్‌ నిర్వహించామన్నారు. ఎదుటి వారిని రెచ్చగొట్టి, హింసాత్మక సంఘటనలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. మాక్‌డ్రిల్‌ చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఏఆర్‌ ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, చిత్తూరు వన్‌టౌన్‌ సీఐ విశ్వనాథరెడ్డి, టూటౌన్‌ సీఐ ఉలసయ్య, ఈస్ట్‌ సర్కిల్‌ సీఐ కుళ్లాయప్ప, వెస్ట్‌ సీఐ రవిశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆందోళన చేస్తున్న మఫ్టీ పోలీసులు

ఆందోళనకారులను చెదరగొడుతున్న పోలీసులు 

గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని