logo

తాళం వేసినా తీరు మారలే..!

తమకు తెలియకుండా ఒక వర్గానికి చెందిన వారు చెప్పిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటూ.. అధికార వైకాపా కౌన్సిలర్లే గతంలో పురపాలిక కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు.

Published : 29 May 2024 01:55 IST

ఉద్యోగాల ఆమోదానికి యత్నం
వ్యతిరేకత రావడంతో సమావేశం రద్దు

పురపాలిక కార్యాలయానికి తాళం వేసిన కౌన్సిలర్లు (పాతచిత్రం)

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: తమకు తెలియకుండా ఒక వర్గానికి చెందిన వారు చెప్పిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటూ.. అధికార వైకాపా కౌన్సిలర్లే గతంలో పురపాలిక కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. అప్పట్లో వైకాపాకు చెందిన ఓ కౌన్సిలర్, కౌన్సిలర్‌ భర్తను పార్టీ నుండి సస్పెండ్‌ చేస్తున్నట్లు వైకాపా ప్రకటించింది. కొన్నాళ్లకు వారి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ వైకాపా నాయకులకు సలామ్‌ చేసిన అధికారుల తీరుపట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ కుప్పం పురపాలిక పరిధిలో 30 మందిని తాత్కాలిక సిబ్బందిని నియమించేందుకు చిత్తూరు ఎమ్మెల్సీ, పురపాలిక ఛైర్మన్‌ ప్రతిపాదిస్తున్నట్లు పురపాలిక సాధారణ సమావేశంలో ఆమోదించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. సాధారణ సమావేశంలో ఆమోదం పొందుదామని పురపాలిక ఛైర్మన్‌ సంతకంతో ఉండటం.. మళ్లీ సొంత వైకాపా కౌన్సిలర్లు వ్యతిరేకించడంతో సాధారణ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు పురపాలిక కమిషనర్‌ ప్రకటన చేశారు. ఏది ఏమైనప్పటికీ తమ అనుచరులకు పురపాలికలో ఉద్యోగాలు కల్పించడానికి వైకాపా నాయకులు నిబంధనలు ఉల్లంఘించి చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు సైతం జీ హుజూర్‌ అనడం ఏమిటని తెదేపా కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు