logo

Road Accident: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన టెంపో వాహనం.. 13 మందికి గాయాలు

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగలి క్రాస్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Published : 25 Dec 2023 14:22 IST

వరగలి: తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగలి క్రాస్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఏలూరు జిల్లా బీమడోలు నుంచి అరుణాచలం వెళ్తున్న టెంపో వాహనం.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేస్తుండగా ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు