logo

నీటి వనరుల్ని సంరక్షించాలి

నీటి వనరుల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఐ.కరుణ కుమార్‌ పిలుపునిచ్చారు.

Published : 22 Mar 2023 03:52 IST

ర్యాలీలో పాల్గొన్న సీనియర్‌ సివిల్‌ జడ్జి కరుణ కుమార్‌

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: నీటి వనరుల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఐ.కరుణ కుమార్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక నగరపాలక కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. నీటిని వృథా చేయకుండా..పొదుపు చేయాలన్నారు. మానవాళికి జీవనాధారమైన నీరు కాలుష్యం బారిన పడుతుందని చెప్పారు. కాలుష్య రహిత నీటిని ప్రజలకు అందించడానికి నగరపాలక, గ్రామీణ నీటి సరఫరా విభాగాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. నగరపాలక కమిషనర్‌ అరుణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శంకర్‌ బాబు, డ్వామా పీడీ గంగాభవాని, భూగర్భజలశాఖ డీడీ గోవర్థన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని