logo

అధిక బిల్లు వచ్చింది.. మీటర్లు మార్చుకోండి: వినియోగదారులకు ఫేక్‌ ఫోన్‌ కాల్స్‌

గతంలో కన్నా ఇటీవల మీకు అధికంగా విద్యుత్తు బిల్లు వస్తున్నదని.. మీ విద్యుత్తు మీటరు మరమ్మత్తు కారణంగా స్పీడ్‌గా తిరుగుతోందని, మీటరు మార్చుకోవాలని, నగదు చెల్లిస్తే వెంటనే మార్పు చేస్తామంటూ అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయి.

Updated : 03 Apr 2024 09:14 IST

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: గతంలో కన్నా ఇటీవల మీకు అధికంగా విద్యుత్తు బిల్లు వస్తున్నదని.. మీ విద్యుత్తు మీటరు మరమ్మత్తు కారణంగా స్పీడ్‌గా తిరుగుతోందని, మీటరు మార్చుకోవాలని, నగదు చెల్లిస్తే వెంటనే మార్పు చేస్తామంటూ అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఫోన్‌ రాగానే కొందరు వినియోగదారులు ఎంత నగదు చెల్లించాలని అడగ్గానే ఫోన్‌ పే ద్వారా రూ.6.500 చెల్లించాలని సూచించి మోసం చేస్తున్నారు. తీరా విచారణలో అసలు అలాంటిదేమీ లేదని విద్యుత్తుశాఖ అధికారులు చెప్పడం గమనార్హం. ఈ ఘటన ఇటీవల చిత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వహకునికి ఎదురైంది. ఇలా చిత్తూరు నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు, పెద్దపెద్ద దుకాణాల యజమానులకు ఇలా అపరిచితుల నుంచి ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. దీంతో కొందరు అప్రమత్తమై తక్షణమే విద్యుత్తు శాఖ అధికారులకు దృష్టికి తీసుకెళ్లి మేల్కొన్నారు. అపరిచితులు అధిక బిల్లులు చెల్లిస్తున్న ఆసుపత్రులు, దుకాణాలను ఎంచుకుని ఫోన్‌కాల్స్‌ చేస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఎవరైనా ఫేక్‌ ఫోన్‌కాల్‌ చేస్తే తమకు తెలియజేయాలని, ఇప్పటికే వీటిపై బాధిత వినియోగదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారని అర్బన్‌ డీఈఈ శేషాద్రిరెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని