logo

పట్టాలిస్తామని పిలిచి.. కండువాలు వేశారు

ఇంటిపట్టాలు ఇస్తామని పిలిచి... వైకాపా కండువాలు కప్పారని.. తామంతా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నామని తాయప్పకొటాలు గ్రామస్థులు స్పష్టం చేశారు. కుప్పం మండలం తాయప్పకొటాలు, పర్తిచేన్లు గ్రామాల్లో సోమవారం రాత్రి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు పి.ఎస్‌.మునిరత్నం పర్యటించారు.

Updated : 03 Apr 2024 04:44 IST

తామంతా తెదేపాలో ఉన్నామన్న తాయప్పకొటాలు గ్రామస్థులు

జనవరి 28న గ్రామస్థులకు వైకాపా కండువాలు కప్పుతున్న నాయకులు, చిత్రంలో భరత్‌

కుప్పం గ్రామీణ: ఇంటిపట్టాలు ఇస్తామని పిలిచి... వైకాపా కండువాలు కప్పారని.. తామంతా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నామని తాయప్పకొటాలు గ్రామస్థులు స్పష్టం చేశారు. కుప్పం మండలం తాయప్పకొటాలు, పర్తిచేన్లు గ్రామాల్లో సోమవారం రాత్రి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు పి.ఎస్‌.మునిరత్నం పర్యటించారు. ఈ సందర్భంగా తాయప్పకొటాలులో జనం స్వచ్ఛందంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ చేతులమీదుగా కండువాలు వేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... జనవరి 28న గ్రామానికి వచ్చిన ఎమ్మెల్సీ భరత్‌, ఆ పార్టీ నాయకులు.. గ్రామస్థులకు ఇంటిపట్టాలు ఇస్తామని పిలిచి.. వైకాపా నాయకులు కండువాలు వేశారని ఆరోపించారు. అందుకే ఇప్పుడు తెదేపాలోకి వచ్చామని చంద్రబాబును లక్ష ఓట్ల ఆధిక్యంతో గెలిపించేందుకు తమవంతు కృషిచేస్తామన్నారు. పర్తిచేను గ్రామంలో విశ్రాంత రైల్వే ఉద్యోగి చెన్నరాయస్వామి, బీసీ నాయకులు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ సమక్షంలో తెదేపాలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని