logo

ఆరు నెలల్లో మారనున్న నగర రూపు

నగరంలో సీతంపేట ప్రాంతంలో ఆసరా వారోత్సవాలను శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంపీ భరత్‌రామ్‌ హాజరై మహిళలకు ఆసరా నమూనా చెక్కు అందించారు.

Published : 02 Apr 2023 04:32 IST

డ్వాక్వా మహిళలకు నమూనా చెక్కు అందిస్తున్న ఎంపీ

ఏవీఏ రోడ్‌: నగరంలో సీతంపేట ప్రాంతంలో ఆసరా వారోత్సవాలను శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంపీ భరత్‌రామ్‌ హాజరై మహిళలకు ఆసరా నమూనా చెక్కు అందించారు. రానున్న ఆరు నెలల్లో నగర రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని, సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.

కమ్యూనిటీ భవన నిర్మాణ స్థలం పరిశీలన

టి.నగర్‌: గోదావరి గట్టున ఫులే విగ్రహానికి ఎదురుగా ఉన్న స్థలంలో ఫులే-అంబేడ్కర్‌ కమ్యూనిటీ హాలు నిర్మాణ స్థలాన్ని ఎంపీ మార్గాని భరత్‌, కమిషనర్‌ దినేష్‌కుమార్‌ శనివారం పరిశీలించారు. భవన నిర్మాణానికి 1,200 గజాల స్థలాన్ని కేటాయించినట్లు కమిషనర్‌ పేర్కొన్నారు. సామాజిక భవనంలో కింద కల్యాణ మండపం, పై భాగంలో స్టడీ సెంటర్‌ నిర్మించనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఎస్‌ఈ పాండురంగారావు, ఇంజనీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని