logo

నిరుద్యోగ సమస్యలపై తెదేపా పోరాటం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలప్పుడు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని యువతకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మోసం చేశారని తెదేపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి విమర్శించారు.

Published : 02 Apr 2023 05:02 IST

తెలుగు యువత నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న అనంతకుమారి

అమలాపురం పట్టణం: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలప్పుడు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని యువతకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మోసం చేశారని తెదేపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి విమర్శించారు. నిరుద్యోగుల సమస్యపై అమలాపురం హౌసింగ్‌బోర్డు తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో తెలుగుయువత నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథి అనంతకుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని, యువత ఉద్యోగాల్లేక పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారన్నారు. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని ఆశచూపించి అధికారంలో వచ్చాక ఏమీ చేయలేదని ఆరోపించారు. ఆనందరావు మాట్లాడుతూ తెదేపా హయాంలో 6.50లక్షల మందికి నిరుద్యోగ భృతి అందించిందని, ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది నిరుద్యోగులున్నారని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 10 కంపెనీలకు అనుమతి లభించగా, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. నిరుద్యోగుల తరఫున తెదేపా పోరాటానికి సిద్ధంగా ఉందని, యువతకు వైకాపా వెంటనే న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, డి.సత్తిబాబురాజు, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి వాసురాజు, గొలకోటి చిన్న, ఆవుపాటి వేణుగోపాల్‌, చీకట్ల నాని, నల్లా మల్లిబాబు, కైరం రాము తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు