logo

Kakinada: రెండు లైట్లున్న ఆలయానికి రూ.4.19 కోట్ల కరెంటు బిల్లు

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేట రామాలయానికి నెలనెలా రూ.వెయ్యి వరకు విద్యుత్తు బిల్లు వస్తుంది.

Updated : 13 Sep 2023 09:29 IST

కొత్తపల్లి: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేట రామాలయానికి నెలనెలా రూ.వెయ్యి వరకు విద్యుత్తు బిల్లు వస్తుంది. ఆగస్టు నెలలో అనూహ్యంగా రూ.4,19,83,536 రావడంతో ఆలయ నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు. గత నెలలో 1,07,37,455 యూనిట్లు వినియోగించినట్లు మంగళవారం జారీచేసిన బిల్లులో చూపడంతో అవాక్కయ్యారు. వెంటనే విద్యుత్తు శాఖ ఏఈ ప్రమోద్‌ను కలిశారు. ఆయన పరిశీలించి మీటర్‌ రీడింగ్‌ను స్కాన్‌చేసే సమయంలో పొరపాటు జరిగిందని చెప్పారు. తక్షణమే ఆ బిల్లును సరిచేసి కొత్తది ఇస్తామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని