logo

రూ.1.04 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం

రూ.1.04 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..  పొట్టిలంక చెక్‌పోస్ట్‌ వద్ద ఓ వాహనాన్ని శుక్రవారం తనిఖీల కోసం నిలుపుదల చేశారు.

Updated : 13 Apr 2024 05:48 IST

కడియం: అనుమతి పత్రాలు లేని ఓ రవాణా వాహనాన్ని.. అందులో ఉన్న  రూ.1.04 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..  పొట్టిలంక చెక్‌పోస్ట్‌ వద్ద ఓ వాహనాన్ని శుక్రవారం తనిఖీల కోసం నిలుపుదల చేశారు.  రాజమహేంద్రవరం డీఎస్పీ అంబికా ప్రసాద్‌, కడియం సీఐ తులసీధర్‌తో పాటు, తహసీల్దార్‌ రమాదేవి, ఆదాయ, జీఎస్టీ విభాగాలకు చెందిన అధికారులు తనిఖీలు చేశారు. అందులో ఉన్న ఆభరణాలను విజయవాడ నుంచి రాజమహేంద్రవరంలోని నాలుగు నగల దుకాణాలకు తీసుకొస్తున్నట్లు గుర్తించారు. పత్రాలున్నప్పటికీ ఎలక్షన్‌ కమిషన్‌ నిర్ధేశించిన సూత్రాలకు అనుగుణంగా వాహన రవాణాకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో దీనిని స్వాధీనం చేసుకున్నారు. ఆ మేరకు డీఎస్పీ మాట్లాడుతూ వాహనంతో పాటు ఆభరణాలను స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఎస్టీ బృందానికి అప్పగించనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని