logo

కొవ్వూరు సర్వతోముఖాభివృద్ధికి కార్యాచరణ

కొవ్వూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రత్యేక కార్యాచరణ అవలంబిస్తున్న పెండ్యాల అచ్చిబాబు మార్గదర్శకమని తెదేపా నాయకులు అన్నారు

Updated : 13 Apr 2024 05:49 IST

భారీ కేకు కోస్తున్న పెండ్యాల అచ్చిబాబు, పక్కన ముప్పిడి, నాయకులు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: కొవ్వూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రత్యేక కార్యాచరణ అవలంబిస్తున్న పెండ్యాల అచ్చిబాబు మార్గదర్శకమని తెదేపా నాయకులు అన్నారు. ఆంధ్రా సుగర్స్‌ జేఎండీ, తెదేపా సీనియర్‌ నాయకులు అచ్చిబాబు జన్మదిన కార్యక్రమాన్ని దొమ్మేరులోని ఆయన నివాసంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గజమాలలు, పుష్పగుచ్ఛాలతో ఆయనను సన్మానించారు. భారీ కేకు కోశారు. తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు, ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంఠమణి రామకృష్ణ, పరిశీలకుడు గొర్రెల శ్రీధర్‌, జనసేన కొవ్వూరు, గోపాలపురం ఇన్‌ఛార్జులు టీవీ రామారావు, దొడ్డిగర్ల సువర్ణరాజు, అల్లూరి విక్రమాదిత్య, పోలవరం మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, సూరపనేని చిన్ని, మద్దిపట్ల శివరామకృష్ణ, సూర్యదేవర రంజిత్‌, పొట్రు శ్రీనివాస్‌, ఎంపీపీ కాకర్ల నారాయుడు, దాయన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని