logo

బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్ల స్కానింగ్‌

సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల ర్యాండమైజేషన్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది

Updated : 13 Apr 2024 05:51 IST

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల ర్యాండమైజేషన్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్‌ అధికారి సూచనల మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో షెడ్యూల్‌ ప్రకారం తొలిరోజు ఈ ప్రక్రియను రాజమహేంద్రరంలోని జిల్లా స్ట్రాంగ్‌రూం కం వేర్‌హౌస్‌ గోడౌన్‌ వద్ద చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. రెండురోజుల పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు చెప్పారు. తాము అనుసరిస్తున్న విధానంపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం అందించామన్నారు. బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్ల స్కానింగ్‌ పనులు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే ఈ కేంద్రంలో భద్రపరిచిన 5,971 బ్యాలెట్‌, 5,463 కంట్రోల్‌ యూనిట్లు, 4,927 వీవీప్యాట్‌లను సాంకేతికంగా తనిఖీ చేసి వాటి పనితీరు నిర్ధారణ చేసి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. తొలిరోజు ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం లాలాచెరువు వద్ద గొడౌన్‌లోని జిల్లా స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి ఈవీఎంలు, అనుబంధ యూనిట్‌లను ప్రత్యేక వాహనాల్లో జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించినట్లు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. జేసీ తేజ్‌భరత్‌, ఆర్వోలు, ఇతర అధికారులు, ఎన్నికల సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని