logo

బొట్టు బిళ్లలనూ వదల్లేదు!

‘కాదేదీ ప్రచారానికి అనర్హం’ అని నిరూపిస్తున్నారు కొందరు వైకాపా నాయకులు.. అవకాశం ఉన్న అన్ని మార్గాలనూ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వినియోగించుకుంటున్నారు.

Published : 16 Apr 2024 03:47 IST

గొల్లప్రోలు: ‘కాదేదీ ప్రచారానికి అనర్హం’ అని నిరూపిస్తున్నారు కొందరు వైకాపా నాయకులు.. అవకాశం ఉన్న అన్ని మార్గాలనూ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వినియోగించుకుంటున్నారు.. మహిళా ఓటర్లకు వైకాపా ఎన్నికల గుర్తు ఫ్యాను, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రాలతో ఉన్న బొట్టుబిళ్లల కార్డులను పంపిణీ చేస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు ఎసీˆ్సపేటలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వంగా గీత ప్రచారం సాగిస్తుండగా.. ఆమె వెంట కార్యకర్తలు, మహిళా ఓటర్లకు 16 బొట్టుబిళ్లలతో ఉన్న ఈ కార్డులను పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని