logo

నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో జగన్‌ పర్యటన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉమ్మడి జిల్లాకు రానున్నారు. ఆ రోజు రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం మీదుగా రావులపాలెం మండలం ఈతకోట చేరుకుంటారు.

Published : 16 Apr 2024 04:03 IST

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉమ్మడి జిల్లాకు రానున్నారు. ఆ రోజు రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం మీదుగా రావులపాలెం మండలం ఈతకోట చేరుకుంటారు. ఇక్కడ జాతీయ రహదారి చెంతన ఒక లేఔట్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రి బస చేస్తారు. 17వ తేదీ శ్రీరామ నవమి నేపథ్యంలో ప్రచారానికి విరామం ఉంటుంది. 18వ తేదీ ఉదయం 10 గంటలకు రోడ్‌ షో చేసుకుంటూ రావులపాలెం మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంటారు. ఈతకోటలో సీఎం బస చేయనున్న ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీధర్‌ సోమవారం ఏర్పాట్లను పరిశీలించి పోలీసులకు తగిన సూచనలు చేశారు.

పెరవలి: సీఎం పర్యటన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్‌ సోమవారం ఏర్పాట్లు పరిశీలించారు. తణుకు నుంచి పెరవలి, ఖండవల్లి మీదుగా రూట్‌మ్యాప్‌ను తనిఖీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని